మహానటికి మరో బంపరాఫర్

0
18

అవును.. మహానటి సావిత్రికి అచ్చు గుద్దినట్లు కనిపించే కీర్తి సురేష్‌ని.. మరో ప్రొఫైల్‌లో చూస్తే..! ముద్దరేసినట్లు జయలలితలా ఉంటుంది. తమిళ్ గ్లామర్ అండ్ పొలిటికల్ ఐకాన్ జయలలిత కటింగ్స్ కీర్తి సురేష్‌లో ఓ మోస్తరుగా ఉన్నట్లు పసిగట్టేసింది కోలీవుడ్. ఎప్పట్నుంచో వర్కవుట్ చేస్తున్న పురచ్చితలైవి జయలలిత బయోపిక్‌కి ఇప్పుడు మోక్షం కలగడం ఖాయంగా కనిపిస్తోంది. 9న విడుదలయ్యే ‘మహానటి’ మూవీతో ఇటు తెలుగు, అటు తమిళ్‌లో కూడా బాగా ఎక్స్‌పోజ్ అయిన కీర్తి సురేష్.. ఈవిధంగా సంపాదించుకున్న క్రేజ్‌ని ఇంకొన్ని రోజులు ‘అమ్ముకోవాలని’ చూస్తోంది! మహానటి కనుక సక్సెస్ అయితే.. ఆ ఫ్లేవర్ ఆరిపోయేలోగా.. కీర్తి సురేష్ కరిష్మాను ‘వాడుకోవచ్చన్నది’ మేకర్స్ ఐడియా. ఆలస్యం చేయకుండా.. జయలలిత జీవిత చరిత్ర మీద ఫోకస్ పెట్టి.. స్టోరీ సిట్టింగ్స్ ఫినిష్ చేసే పనిలో పడ్డారంటూ.. ‘పేరు’ లేని ఒక బేనర్ మీద వార్తలొస్తున్నాయి. ఇప్పటికైతే.. కీర్తి సురేష్‌లో మహానటి సావిత్రిని చూసుకుంటూ మైమరచిపోతున్న ప్రేక్షక జనం.. కొంత గ్యాప్ తర్వాత.. మహా నాయకురాలు జయలలితను కూడా కీర్తిలో చూసుకోడానికి సిద్ధం కావొచ్చన్న మాట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here