మళ్లీ షూటింగ్ కు సంజయ్ దత్

0
25

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన సంజూ భాయ్ కి ఇప్పుడు టైం కలిసొచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలో నటించబోతున్నాడు. అదికూడా ఒక సినిమా కాదు. వరసగా 10 సినిమాలు చేయబోతున్నాడు. సంజయ్ దత్ 2013లో జంజీర్, పోలీస్ గిరి సినిమాలు చేశాడు. 2014 లో ఉంగ్లీ, జైలుకెళ్లే ముందు పికె సినిమాలు చేసిన సంజూ చాలా కాలం తర్వాత .. ఈ నెల 29న భూమి అనే పిక్చర్ షూటింగ్ కు హాజరు కాబోతున్నాడు.

డైరెక్టర్ ఓమంగ్ కుమార్ తీసే భూమి సినిమాతో సంజయ్ దత్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడని చెప్పవచ్చు. భూమి షూటింగ్ రెండు నెలలపాటు జరుగుతుంది. సంజయ్ దత్ తన కేరక్టర్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నాడు. స్లిమ్ నెస్ కోసం రోజూ రెండు గంటలు జిమ్ కు వెడుతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేశాక మున్నాభాయ్ .. మార్కో భావు అనే పిక్చర్ చేస్తాడట.

సంజయ్ దత్ ఈ రెండు సినిమాలే కాక మరికొన్ని పిక్చర్స్ కూడా చేయబోతున్నాడు. టోటల్ ధమాల్, సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్, విధు వినోద్ చోప్రా తదుపరి మూవీ, రోహిత్ జుగ్ రాజ్ చిత్రం ఈ ఏడాది చేయబోతున్నాడు. ఇక వచ్చే ఏడాదిలో ఖల్ నాయక్ రిటర్స్న్, షేర్, మున్నాభాయ్ 3, తోర్ బాజ్, కూచీ కూచీ హోతా హై సినిమాలు చేయబోతున్నాడు. ఈ లిస్ట్ చూస్తుంటే సంజయ్ దత్ కు మళ్లీ ఇదివరకటి గ్లోరియస్ డేస్ వచ్చాయనిపిస్తుంది.

LEAVE A REPLY