మళ్లీ పెట్రో మంట! కర్ణాటక ఎన్నికలు ముగియగానే బాదుడు

0
5

పెట్రో మంటకు మళ్లీ తెర లేవబోతున్నది. కర్ణాటక ఎన్నికలవల్ల రెండువారాలుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆ ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం కనిపిస్తున్నది. అంతర్జాతీ యంగా ముడిచమురు ధరలు పెరుగడం, రూపాయి మారకం విలువ బలహీనపడటంతో గత రెండువారాల్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 2 వరకు పెరుగాలి. కర్ణాటక ఎన్నికలు ముగిసేవరకు పెట్రో ధరలను పెంచొద్దని చమురు సంస్థలను కేంద్రం ఆదేశించడమే కారణమని తెలుస్తున్నది. ఇందులో తమ ప్రమేయం లేదని కేంద్రం బుకాయిస్తున్నా, పెట్రోలియం ధరలు ఏప్రిల్ 24 నుంచి స్థిరంగా ఉన్నాయి. ఇంధన ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేతతో కొన్నేండ్లుగా దేశీయ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతోపాటు రవాణా చార్జీలు, అన్ని రకాల పన్నులు కలిపి రిటైల్ ధరలను నిర్ణయిస్తున్న విష యం తెలిసిందే. ఏప్రిల్ 25 నుంచి ఇప్పటివరకూ ఢిల్లీలో పెట్రోల్ ధర బ్యారెల్‌కు 2.9 డాలర్లు, డీజిల్ ధర 2.64 డాలర్ల చొప్పున పెరిగాయి. రూపాయి మారకం విలువ రూ.1.26 మేర పతనమైంది. కర్ణాటక ఎన్నికలు లేకుంటే గత రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.84, డీజిల్ ధర రూ.1.78 చొప్పున పెరిగేది. ధరల స్థిరీకరణ లక్ష్యంతోనే చమురు సంస్థలు ఇంధన ధరలను సవరించలేదని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం యాదృచ్ఛికమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ సంజీవ్‌సింగ్ చెప్పారు.

LEAVE A REPLY