మళ్లీ ‘టేక్ ఇట్ ఈజీ ఊర్వ‌శి’ అంటున్న రెహ‌మాన్‌

0
26

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్‌, భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన మ్యూజిక్ కంపోజ‌ర్స్‌లో ఒక‌డు ఏఆర్ రెహ‌మాన్‌. 23 ఏళ్ల కింద‌ట ప్రేమికుడు సినిమాలో అత‌ను కంపోజ్ చేసిన ఊర్వ‌శి.. ఊర్వ‌శి.. సాంగ్ ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. కొన్నేళ్ల పాటు కుర్ర‌కారును ఓ ఊపు ఊపిందీ సాంగ్‌. అలాంటి పాట‌ను ఇప్పుడు రీక్రియేట్ చేశాడు రెహ‌మాన్‌. అభిమానులు అందించిన కొత్త లిరిక్స్‌తో ఈ పాట‌ను రెహ‌మాన్ కంపోజ్ చేశాడు. కొన్ని రోజుల కింద‌టే ఈ పాట‌కు కొత్త లిరిక్స్ ఇవ్వాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా రెహ‌మాన్ కోరాడు. నోట్ల ర‌ద్దు, అమెరికా ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు వంటి స‌మ‌కాలీన అంశాల‌తో కొత్త లిరిక్స్ రాశారు కొంద‌రు ఔత్సాహికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here