మళ్లీ ఎస్పీ గూటికి అఖిలేష్ యాదవ్‌

0
15

లక్నో : సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ముగిసింది. 24 గంటల్లోనే తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తొలిగిపోయాయి. అఖిలేష్‌ను ములాయమ్ రాత్రి గెట్ అన్నారు.. తిరిగి పొద్దున్నే వెల్‌కమ్ బ్యాక్ అని ఆహ్వానించారు. వీరిద్దరి మధ్య అజాం ఖాన్ నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించినట్లు తెలిసింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అజాం ఖాన్ జోక్యం వల్ల తండ్రి కొడుకుల మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగిపోయాయి. ఇవాళ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ నివాసంలో జరిగిన భేటీలో అఖిలేష్‌తో రాజీ కుదిరింది. అఖిలేష్ సహా రాంగోపాల్‌పై వేసిన బహిష్కరణ ఎత్తివేశారు.

LEAVE A REPLY