మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ నేటినుంచి

0
26

అత్యుత్తమ ఫామ్ కోసం తంటాలుపడుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు ఇదే మంచి తరుణం. కొన్నాళ్లుగా టైటిల్ లేక బాధపడుతున్న ఈ హైదరాబాదీ ఏస్‌కు ఇప్పుడు మలేసియా మాస్టర్స్ రూపంలో అద్భుత అవకాశం లభించింది. మంగళవారం నుంచి మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగనుంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనా ఈ సీజన్ ప్రారంభ టోర్నీలో కచ్చితంగా సత్తాచాటగలనన్న విశ్వాసంతో ఉన్నది. ఇటీవలే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రూపంలో మంచి ప్రాక్టీస్ లభించడం ఒక కారణమైతే, ప్రపంచ టాప్ షట్లర్లు ఎవరూ మలేషియా ఈవెంట్‌కు రాకపోవడం మరో కారణం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గతేడాది ఏకైక టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న సైనా, మోకాలి గాయంతో బాధపడుతూనే రియో ఒలింపిక్స్‌లో పోటీపడి రెండోరౌండ్లోనే నిష్క్రమించింది

LEAVE A REPLY