మలయాళ చిత్రంలో అమితాబ్

0
17

ఒకరు.. 45 ఏళ్లుగా తన అసమాన అభినయంతో బాలీవుడ్‌ను ఏలుతున్న దిగ్గజ నటుడు. మరొకరు మలయాళ సూపర్‌స్టార్. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది. బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్, మలయాళ నటుడు మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఓడియన్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ తండ్రిగా అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో మలయాళ భాషలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమితాబ్‌బచ్చన్, మోహన్‌లాల్ కలయికలో గతంలో కాందహార్, ఆగ్ సినిమాలు రూపొందాయి. మూడోసారి ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్, మంజువారియర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here