మరో 40 పైసలు పతనమైన రూపాయి

0
24

అగ్రరాజ్య కరెన్సీ ధాటికి దేశీయ రూపాయి మరింత బక్కచిక్కింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 40 పైసలు పడిపోయి 67.83 వద్దకు చేరుకుంది. విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లవచ్చన్న ఆందోళన నేపథ్యంలో డాలర్‌కు దిగుమతిదారుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగడం ఇందుకు కారణమైంది. నవంబర్ 15 తర్వాత రూపాయికి ఇదే అతిపెద్ద పతనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలలపాటు డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 67-71 మధ్య స్థాయిలో కదలాడవచ్చని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేస్తున్నది.

LEAVE A REPLY