మరో హారర్ చిత్రంలో

0
30

రాఘవ లారెన్స్ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ గంగ. ఈ సినిమాలో నటించి తొలిసారి భయపెట్టిన తాప్సీ మరోసారి అదే తరహా చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. రొటీన్ గ్లామర్ పాత్రల్లో నటించలేకే తెలుగులో సినిమాలు అంగీకరించడం లేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపిన తాప్సీ నటనకు అవకాశమున్న సినిమా కావడంతో తెలుగులో తెరకెక్కనున్న ఓ హారర్ థ్రిల్లర్‌ని అంగీకరించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే…గతంలో పాఠశాల పేరుతో ఓ వినూత్నమైన చిత్రాన్ని తెరకెక్కించిన మహి రాఘవ్ త్వరలో ఓ హారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం తాప్సీని ఖరారు చేసినట్లు సమాచారం. ఆమెతో పాటు ఈ చిత్రంలో మరికొంత మంది పేరున్న నటీనటులు నటించనున్నారట. కాగా ఈ చిత్రంలోని తన పాత్రకు తాప్సీ డబ్బింగ్ చెప్పుకోనుందని తెలిసింది. తాప్సీ ప్రస్తుతం ఘాజీతో పాటు నామ్ శబానా, తడ్కా, జుడ్‌వా-2 చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here