మరో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బట్లర్‌

0
6

ఈ ఐపీఎల్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన జట్లు. ఐతే ప్లేఆఫ్‌ ఆశలు చాలా సంక్లిష్టంగా మారుతున్న దశలో అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో మళ్లీ రేసులోకి దూసుకొచ్చాయి ఈ రెండు జట్లూ. వీటి మధ్య కీలక పోరులో రాజస్థాన్‌దే పైచేయి అయింది. తన సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌ని ముంబయి గొప్పగా ఆరంభించినా.. మధ్యలో రాయల్స్‌ పుంజుకుంది. బౌలర్లు ఆతిథ్య జట్టుకు కళ్లెం వేస్తే.. తర్వాత జోస్‌ బట్లర్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. జట్టుకు హ్యాట్రిక్‌ విజయాన్నందించాడు. ఈ మూడు విజయాల్లోనూ అతడే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం. 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది ఆరో విజయం కాగా.. ముంబయికి ఏడో ఓటమి. రాయల్స్‌ గెలుపుతో నాలుగు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించే అవకాశం లేకపోవడంతో చెన్నై ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ జట్టు ఆదివారమే ఎనిమిదో విజయం (సన్‌రైజర్స్‌పై) సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here