మరిప్పుడు జైలుకు ఎవరెళ్లాలో సీఎం చంద్రబాబే చెప్పాలి

0
12

రాష్ట్ర ప్రయోజనాల పేరుతో సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతో ప్రవర్తి స్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, దానికోసం ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, ప్రతిపక్ష నేత జగన్‌ ఆ ఆందోళనను ముందుకు తీసుకెళ్తుంటే అందుకు సహకరించవద్దని, హోదాకు, ప్యాకేజీకి తేడా రూ.3 వేల కోట్లేనని గతంలో చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం నినాదాన్ని తెరపైకి తేవటంలో కుట్ర దాగుందని స్పష్టం చేస్తున్నారు. ఒక రోజు కేంద్రం అన్నీ ఇచ్చిందని అంటూ మరో రోజు ఏమీ రాలేదని సీఎం అనటాన్ని ఖండించారు. రాష్ట్రం మేలు కోసం ఆలోచించే వారు ఇలా పూటకో రకంగా మాట్లాడరని గుర్తు చేస్తున్నారు. రెండు నాలుకల ధోరణితో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

LEAVE A REPLY