మన్‌జీత్‌కు 75.5 లక్షలు

0
18

ప్రో కబడ్డీ ఐదో సీజన్‌కుగాను ఆటగాళ్ల వేలం సోమవారం మొదలైంది. వరుసగా రెండురోజుల పాటు జరిగే ఈ వేలంలో తొ లిరోజు భారత్ తరఫున స్టార్ ఆల్‌రౌండర్ మన్‌జీత్ చిల్లార్‌కు అ త్యధిక ధర పలికింది. జైపూర్ పింక్‌పాంథర్ జట్టు రూ. 75.5 లక్షలు వెచ్చించి మన్‌జీత్‌ను కొనుగోలు చేసింది. మన్‌జీత్ తర్వాత అత్యధిక ధరతో డిఫెండర్ సుర్జీత్ సింగ్ రూ. 73 లక్షలకు బెంగాల్ వారియర్స్‌కు అమ్ముడుపోయాడు. బెంగాల్ జట్టు రణ్‌వీర్ సింగ్‌ను రూ. 47.5 లక్షలకు కొనుక్కుంది. దక్షిణ కొరియాకు చెందిన జాన్ కున్ లీని బెంగాల్ వారియర్స్ జట్టు రూ. 80.3 లక్షలతో అట్టిపెట్టుకుంది.

లీగ్‌లో ఖరీదైన ఆటగాడిగా జాన్ ముందున్నా, వేలం పరంగా అత్యధిక ధరను అందుకున్న ఆటగాడు మన్‌జీతే. మిగతా ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ రాజేశ్ నర్వాల్‌ను లీగ్‌లో కొత్త ఫ్రాంచైజీ ఉత్తరప్రదేశ్ జట్టు రూ. 69 లక్షలకు కొనుక్కోగా, గత సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ఆడిన సందీప్ నర్వాల్‌ను రూ. 66 లక్షలకు పుణెరి పల్టాన్ దక్కించుకుంది. కుల్‌దీప్ సింగ్ రూ. 51.5 లక్షలకు (యూ ముంబా), రాకేశ్ కుమార్ రూ. 45 లక్షలకు (తెలుగు టైటాన్స్) అమ్ముడవగా.. సచిన్ ఆధ్వర్యంలోని తమిళనాడు ఫ్రాంచైజీ అమిత్ హుడా ను రూ. 63 లక్షలకు, అనిల్ కుమార్‌ను రూ. 21.5 లక్షలకు కొనుగోలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here