మత్స్యరంగాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దుతాం

0
20

తెలంగాణ: రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్ది మత్స్యవిప్లవం తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాకతీయులు, రెడ్డి రాజులు అందించిన చెరువులు, మధ్య తరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్ర జీవికను సుస్థిరం చేస్తామన్నారు. ఏటా 11 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఐదువేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే కీలక ఆదాయవనరుగా మత్స్యపరిశ్రమను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో చేపల పెంపకంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘుచర్చలో పాల్గొన్న సీఎం, మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న బృహత్ ప్రణాళికను సభముందు ఆవిష్కరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర జీవిక సుస్థిరం చేసేలా, స్వరాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

LEAVE A REPLY