మత్తయ్య మాట మోదీ వింటారా?

0
9

తొలిరోజు జరిపిన 5 గంటల సమీక్ష సరిపోలేదు.. మరుసటిరోజు కూడా ‘ఓటుకు నోటు’ కేసు మీద స్పెషల్ సిట్టింగ్ వేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తుది ఛార్జ్‌షీట్ దాఖలు చెయ్యడానికి మలి కసరత్తు షురూ అవుతోందని.. చంద్రబాబు పేరు చేర్చాలా వద్దా అనే మీమాంస దగ్గరే కేసీఆర్ ఆగిపోయారని ‘ప్రగతి భవన్’ నుంచి వాసనొస్తోంది. దీంతో.. రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనూ కదలిక మొదలైంది. ఏకంగా సీఎం చంద్రబాబు ‘ఇన్వాల్వ్ మెంట్’ ఉందన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసు ‘వెలికితీత’పై మాటల తూటాలు పేలుతున్నాయి. ”కర్ణాటకలో బీజేపీని ఓడించాలని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే ఈ కేసు బైటికొచ్చింది. దీనివెనుక అమిత్ షా, మోదీ డైరెక్షన్ ఖచ్చితంగా వుంది” అంటూ తెగేసి చెప్పారు మరో కీలక నిందితుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వున్న రేవంత్‌ని, తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉమ్మడిగా ఇబ్బంది పెట్టడానికే ఈ ఎత్తుగడ వేసినట్లు తెరాస మీద విసుర్లు పడిపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here