మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ

0
59

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఓ్ర పార్థనా మందిరంపై బాంబుదాడి జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో వందతులు వ్యాపించడంతో ముందస్తు చర్యగా తూర్పు ఇంఫాల్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.
ఈశాన్యరాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. తూర్పు ఇంఫాల్ జిల్లాలో అధికారులు కర్ఫ్యూను విధించారు. ఇంఫాల్‌తోపాటు పలు ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఓ ప్రార్థనా మందిరంపై దాడులు జరుగుతాయనే వదంతులు దావాలనంలా వ్యాపించడంతో ముందస్తు చర్యగా తూర్పు ఇంఫాల్, పోరంపాట్, సవోంబంగ్ సబ్ డివిజన్ ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించామని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఇంఫాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే తాము ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు. గత శుక్రవారం గంట వ్యవధిలో మూడు చోట్ల బాంబుపేలుళ్లు జరిగాయి. అనంతరం ఓ ప్రార్థనా మందిరంపై బాంబు దాడి జరుగుతుందనే వందతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here