మణికొండలోని ఆరు ఎకరాల వక్ఫ్ స్థలంలో నిర్మాణం

0
17

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్‌హాల్ నిర్మాణం కానుంది. గచ్చిబౌలి సమీపంలోని మణికొండ వద్ద గల వక్ఫ్‌భూముల్లో ఆరు ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్‌హాల్ నిర్మాణానికి రూ.40 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. తానే స్వయంగా ఇస్లామిక్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేస్తానని సీఎం ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ తరహాలో హైదరాబాద్‌లో కూడా ఒక సెంటర్‌ను ఏర్పాటుచేయాలనే డిమాండ్ ముస్లిం వర్గాల్లో చాలారోజుల నుంచి ఉంది. ముస్లిం రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల అసెంబ్లీలో మైనారిటీ సంక్షేమంపై లఘు చర్చ జరిగిన సందర్భంగా ఎంఐఎం నుంచి కూడా ఈ ప్రస్తావన వచ్చింది.

LEAVE A REPLY