మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం

0
6

కార్పోరేట్‌, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఫీజుల దోపిడీని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు అయ్యప్ప మాట్లాడుతూ.. సామాన్యుడిని నిలువునా దోచుకుంటున్న ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మకై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వం తిరుపతిరావు కమిటీ పేరుతో కాలయాపన చేసి యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించిందే తప్ప సామాన్యుడికి జరిగిందేమి లేదని మండిపడ్డారు. నీట్‌ తరహాలోనే ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేసి మెరిట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ యాజమాన్య కోటా సీట్ల వ్యవహారంపై సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here