మంత్రులతో ఆర్‌ నారాయణమూర్తి భేటీ

0
21

ప్రముఖ నటుడు ఆర్‌.నారాయణమూర్తి బుధవారం వెలగపూడి సచివాలయానికి వెళ్లి మంత్రులతో భేటీ అయ్యారు. దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్య శాఖ కామినేని శ్రీనివాస్‌లతో ఆయన మాట్లాడారు. ఈ భేటీపై విలేకరులు ప్రశ్నించగా తన స్వగ్రామం రౌతుల పూడిలో ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి నిమిత్తం విజ్ఞాపనలు చేసేందుకు కలిశానన్నారు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు తాను సమకూర్చినట్లు తెలిపారు. ఆ ఆసుపత్రికి అవసరమైన వైద్య, పారామెడికల్‌ సిబ్బంది లేరనీ, ఆ సమస్యను మంత్రి కామినేని దృష్టికి తీసుకువెళ్లానన్నారు. రైతులపూడిలో 19వ శతాబ్దం నాటి శివాలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి మాణిక్యాలరావుకి విజ్ఞప్తి చేశానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here