మండలి, అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు

0
16

రాష్ట్ర శాసనమండలి, అసెంబ్లీ ఆవరణలలో గురువారం 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలిలో చైర్మన్ కే స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్‌లు బీ వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, ఫారుఖ్‌హుస్సేన్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జెండా ఎగురవేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల ప్రాంగణంలో రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అసెంబ్లీ సంయుక్తకార్యదర్శి నరసింహాచార్యులు జెండాలు ఎగురవేశారు.

LEAVE A REPLY