మంటగలిసిన మానవత్వం

0
16

ప్రమాదం జరిగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరించని లోకమిది. చుట్టూ చేరి ఫొటోలు తీసుకున్నారే తప్ప దవాఖానకు తరలించలేదు. ఫలితంగా విధి నిర్వహణలో ఓ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు వదిలారు. కర్ణాటకలోని మైసూర్‌లో శనివారం పోలీసు జీపు, బస్సు ఢీకొనడంతో జీపు డ్రైవరు లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇన్‌స్పెక్టర్ కుమార్(38) తీవ్రంగా గాయపడ్డారు. జీపులో ఇరుక్కొని తల్లడిల్లినా ఎవరూ దవాఖానకు తరలించే ప్రయత్నం చేయలేదు. ప్రమాదంతో జీపు చుట్టూ గుంపులుగా చేరిన జనం గంటపాటు ఫొటోలు, వీడియోలు తీశారే తప్ప ఎవరూ సాయం అందించలేదు. తర్వాత దవాఖానకు తరలించగా కుమార్ మృతిచెందారు. ఇటీవల బెంగళూరులోనూ ఓ లారీ ఢీకొని యువకుడు కాళ్లు తెగిపడి సాయం కోసం విన్నవించినా ఎవరూ స్పందించలేదు. ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించే వారికి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వాలు తెలుపుతున్నా సాయం చేసేవారు కరువవుతున్నారు.

LEAVE A REPLY