మంచు వర్షంలో చిక్కుకున్న ఎపి యాత్రికులు!

0
9

ఉత్తరాఖండ్: చార్‌ధామ్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఎపికి చెందిన యాత్రికులు బద్రీనాథ్ వద్ద మంచు వర్షంలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి 104 మంది యాత్రికులు యాత్రకు వెళ్లారు. యాత్రికులంతా ఏప్రిల్ 26న చార్‌ధామ్ యాత్రకు బయల్దేరారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన 104 మంది యాత్రికులు మంచు వర్షంలో చిక్కుకున్నారు. కాగా, బాధిత యాత్రికులంతా 55 ఏళ్లకు పైబడిన వారేనని తెలుస్తోంది. 104 మందిలో 39 మంది యాత్రికులు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మిగిలిన 65 మంది బద్రీనాథ్‌లోని ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు సమాచారం. 65 మంది బాధితుల్లో ఆరుగురు విశాఖ వాసులు. వారిలో కలివరపు ముత్యాలరావు, అతని భార్య. విశాఖలోని వేపగుంటకు చెందిన ఎస్ కామేశ్వరరావు, ఎస్ భారతి… విశాఖలోని కంచరపాలెంకు చెందిన వడ్డీ కాశీవిశ్వనాథం, వడ్డీ విజయలక్ష్మీఉన్నారు. యాత్రికులు భోజనం కూడా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. యాత్రికుల పరిస్థితిని ఎపి భవన్ అదనపు కమిషనర్ అర్జా శ్రీకాంత్, టిడిపి పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ పర్యవేక్షించారు. మంచువర్షంలో చిక్కుకున్న యాత్రికులతో అధికారులు మాట్లాడారు. 39 మంది జెడ్‌పిటిసిల బృందం సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని సీతాపురికి జెడ్‌పిటిసిలు, అధికారుల బృందం చేరుకుంది. ఉపాధిహామీ పనుల పరిశీలన కోసం ఉత్తరాఖండ్ వెళ్లిందీ బృందం. శ్రీకాకుళం జెడ్‌పిటిసి ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ ఆధ్వర్యంలో బృందం వెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here