భోపాల్‌ బరిలో దిగ్విజయ్‌

0
23

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. భోపాల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన సుదీర్ఘ చర్చల అనంతరం భోపాల్‌ నుంచి పోటీ చేయడానికి దిగ్విజయ్‌ నిర్ణయించుకున్నారన్నారు. ఆయన నిర్ణయంపై తామంతా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. అయితే దీనిపై దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం ఇంకా స్పందించలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here