భేదాభిప్రాయాలున్నా పార్లమెంటు పనిచేయాలి

0
24

‘పార్లమెంటు అంటే మహా పంచాయతీ. ఎన్ని భేదాభిప్రాయాలున్నా పార్లమెంటు పనిచేయాలి. బడ్జెట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు రాజకీయ పక్షాలన్నీ సహకరించాలి’ అని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాల మధ్య విభేదాలు ఉండవచ్చేమో గానీ పార్లమెంటును మాత్రం ఇలాంటి విభేదాలతో స్తంభింపజేయరాదని ప్రధాని పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ మినహా అన్ని పార్టీల ప్రతినిధులూ పాల్గొన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపినందువల్ల పార్లమెంటులో దానిపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్‌, సీపీఎం డిమాండ్‌ చేశాయి. దీనిని మళ్లీ పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టీకరించాయి. ప్రధాని విజ్ఞప్తిపై అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.అనంత్‌కుమార్‌ ఈ సమావేశానంతరం విలేకరులకు చెప్పారు. బడ్జెట్‌ వాయిదా డిమాండ్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం తమ తీర్పునిచ్చాయని చెప్పారు. బడ్జెట్‌ అందరికీ లబ్ధి కలిగించి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here