భూ అభివృద్ధికి కొత్త నిబంధనలు

0
17
రాష్ట్రంలో ఒక్కసారిగా మిర్చి ధర పతనమై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు సాయం చేయవచ్చు.. కేంద్రం నుంచి ఎలా సాయం రాబట్టాలన్న అంశంపై చర్చించారు. మార్కెట్‌ యార్డులకు వెళ్లి రైతులతో మాట్లాడి.. ఒక నివేదిక ఇవ్వాలని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గుంటూ రు జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులకు సూచించింది. ఆ నివేదిక రాగానే కార్యాచరణకు దిగాలని నిర్ణయించింది. అదే సమయంలో తగిన సాయం కోసం కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలని తీర్మానించింది. కేబినెట్‌ భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు తెలిపారు.

LEAVE A REPLY