భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

0
22

భూసేకరణ చట్టం-2013 సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహముద్ అలీ ప్రవేశపెట్టారు. భూసేకరణ చట్టంలో సవరణలను మహముద్ అలీ ప్రతిపాదించారు. కేంద్రం సూచన మేరకు భూసేకరణ చట్టం బిల్లులో స్వల్ప మార్పులు చేశారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర మధుసూదనాచారి ప్రకటించారు.
సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి స్పందిస్తూ.. నిన్న బీఏసీ నిర్ణయం ప్రకారం.. ఆ మేరకు నడుచుకోవాలని కాంగ్రెస్ సభ్యులకు ఆయన సూచించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో ఎంఐఎంకు స్పీకర్ అవకాశమిచ్చారు. ఎంఐఎం తరపున ఈ బిల్లుపై ఎమ్మెల్యే పాషాఖాద్రీ మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here