భూగ్రహం వైపు నిబిరు దూసుకొస్తుందట

0
51

వాషింగ్టన్: ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచం కనుమరుగుకానున్నదట. భూగ్రహాన్ని నిబిరు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తున్నదట. గత 2003 నుంచి ఇలాంటి వార్తలు మధ్యలో ఆగిపోయినప్పటికీ.. కుట్ర సిద్ధాంతకర్తల ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చాయి. భూగోళం అంతరించిపోతుందనే విషయాన్ని తాజా గా డేవిడ్ మీడే అనే రచయిత ప్లానెట్ టెన్ – ది 2017 అరైవల్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. వందేండ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు విచ్ఛిన్నం చేసిందని కుట్ర సిద్ధాంతకర్తల వాదన. సౌర వ్యవస్థ చివరలో ఉన్న దీనిని పదో గ్రహంగా భావిస్తున్నారు. దక్షిణ ధ్రువం వైపు దూసుకొస్తున్న ఈ గ్రహం తనతోపాటు మరో ఏడు గ్రహాలను వెంటబెట్టుకొస్తున్నదని పేర్కొంటున్నారు

LEAVE A REPLY