భారీగా పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం

0
27

తెలంగాణ:వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో గడిచిన రెండేండ్లుగా ఈ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. రెండు డిస్కంల పరిధిలో 13వేల మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవుతుండటం చూస్తుంటే, రాష్ట్ర రైతాంగం అన్ని కష్టాలను దాటుకుని సాగుబడికి పయనం అవుతున్నట్లు కనిపిస్తున్నది. 2015-2016 సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, అదే సమయంలో వ్యవసాయానికి 9గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరాతో రైతులు పంటలు వేసుకునేందుకు ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో రెండు డిస్కంల(టీఎస్‌ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)పరిధిలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.

LEAVE A REPLY