భారీగా పతనమైన రూపాయి

0
7

దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మొట్టమొదటిసారి డాలర్‌కు మారకంలో 69 మార్కును చేధించిన రూపాయి ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. బుధవారం ట్రేడింగ్‌ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలో మరింత క్షీణించింది. ప్రస్తుతం 79 పైసల మేర క్షీణించి 69.04గా ట్రేడవుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతాయని సంకేతాలు, ఈ రేట్ల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

LEAVE A REPLY