భారత సంతతి ప్రభుత్వ న్యాయవాది ప్రీత్ బరారా తొలగింపు

0
23

అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రభుత్వ న్యాయవాది ప్రీత్ బరారాను ట్రంప్ ప్రభుత్వం పదవిలో నుంచి తొలగించింది. తొలుత రాజీనామా చేయమని కోరగా ఆయన తిరస్కరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఒకప్పటి ఒబామా ప్రభుత్వం నియమించిన 45 మంది ప్రభుత్వ న్యాయవాదులను వెంటనే పదవులకు రాజీనామా చేయమని ట్రంప్ ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రీత్ భరారాను శుక్రవారం అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ కోరారు. ఆయన నిరాకరించడంతో పదవిలో నుంచి తొలగించారు. దీనిపై భరారా ట్విట్టర్‌లో స్పందించారు. నేను రాజీనామా చేయలేదు. కొన్ని క్షణాల క్రితం నన్ను పదవిలో నుంచి తొలగించారు. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ అటార్నీ పదవి నా వృత్తి జీవితంలో ఎప్పటికీ గౌరవప్రదమైనదిగా మిగిలిపోతుంది అని ఆయన ట్వీట్ చేశారు.

LEAVE A REPLY