భారత వాయుసేన అధికారులు గడ్డం పెంచరాదని సుప్రీంకోర్టు తీర్పు

0
45

భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారులు గడ్డం పెంచరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ అధికారి ఏ కులం, మతం, ప్రాంతానికి చెందిన వారైనా సరే ఇదే తీర్పు వర్తిస్తుందని పేర్కొన్నది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మత ఆచారాల ప్రకారం గడ్డం పెంచేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించకపోవడం ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘించినట్టు అవుతుందని ప్రశ్నించింది. 2003లో వాయుసేన అధికారులు గడ్డం పెంచడంపై కేంద్రం నిషేధం విధించింది.

LEAVE A REPLY