భారత మహిళల జట్టుకు హ్యాట్రిక్‌ విజయం

0
31

నాలుగు దేశాల మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. జింబాబ్వే జట్టుతో గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.4 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/14), రాజేశ్వరి గైక్వాడ్‌ (3/25) రాణించగా… శిఖా పాండే, మాన్సి జోషి, పూనమ్‌ యాదవ్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.
అనంతరం భారత జట్టు కేవలం 18.3 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 94 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వేద కృష్ణమూరి ఖాతా తెరవకుండానే అవుటవ్వగా… హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (55 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు), మోనా మేష్రమ్‌ (53 బంతుల్లో 46; 6 ఫోర్లు, ఒక సిక్స్‌) రెండో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశారు. నాలుగు జట్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న ఐర్లాండ్‌తో ఆడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here