భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు

0
26

దుబాయ్: భారత బ్యాడ్మింటన్ నంబర్‌వన్ పీవీ సింధు వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్‌లో తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో తన తొలిమ్యాచ్‌ను విజయవంతంగా అధిగమించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సింధు 12-21, 21-8, 21-15తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచిపై విజయం సాధించింది. దాదాపు గంటకుపైగా సాగిన హోరాహోరీ పోరులో తొలిగేమ్ కోల్పోయిన సింధు, తర్వాత అద్భుతంగా పుంజుకొని పైచేయి సాధించింది. ఆరంభంలో 3-6తో వెనుకబడ్డ సింధు, ప్రత్యర్థి బలమైన స్ట్రోక్‌లకు అంతేదీటుగా బదులిస్తూ 11-8తో ముందంజ వేసింది. బ్రేక్ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న యమగుచి వరుసపాయింట్లతో 14-11తో ముందుకెళ్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here