భారత కెప్టెన్ అమృత్‌రాజ్‌కు బైబై

0
25

భారత టెన్నిస్ జట్టులో కీలకమార్పులు చోటు చేసుకున్నాయి. డేవిస్‌కప్‌లో ఆడే భారత జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఊహించినట్లే ప్రస్తుత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్‌పై వేటు పడింది. అమృత్‌రాజ్ స్థానంలో వెటరన్ స్టార్ ఆటగాడు, అనేక గ్రాండ్‌స్లామ్స్ కొల్లగొట్టిన మహేశ్ భూపతికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏఐటీఏ పలు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు పుణె వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ ఆడే ఆసియా/ఓషియానా జోన్ గ్రూప్1 డేవిస్‌కప్ పోరే ఆనంద్ అమృత్‌రాజ్‌కు చివరిదని ఏఐటీఏ స్పష్టం చేసింది. ఆ తర్వాత నుంచి జట్టు కెప్టెన్‌గా భూపతి వ్యవహరిస్తాడని ప్రకటించింది. మరో ఏడాదిపాటు తనను కెప్టెన్‌గా కొనసాగించాలన్న అమృత్‌రాజ్ విజ్ఞప్తిని ఏఐటీఏ అస్సలు పట్టించుకోలేదు. అమృత్‌రాజ్ హయాంలో జట్టు ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించడంతోపాటు, వివిధ టోర్నీల్లో జట్టు ప్రదర్శన అంత బాగా లేకపోవడంతో అతనిపై ఏఐటీఏ వేటు వేయక తప్పలేదు. కెప్టెన్‌గా ప్రతి ఒక్కరికి అవకాశం దక్కాలి

LEAVE A REPLY