భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్

0
34

భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కళంకితులకు పదవులు కట్టబెట్టడంపై తీవ్ర దుమారం చెలరేగినా ఇంతవరకు ఆ విషయంలో నోరు మెదపని ఆయన.. ఐవోఏ వేటుపై మాత్రం స్పందించాడు. ఈ విషయంపై ప్రభుత్వంతోనే తేల్చుకుంటానని స్పష్టం చేశాడు. అంతకంటే ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతానని వెల్లడించాడు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత పనుల మీద నేను న్యూజిలాండ్‌లో ఉన్నా. ప్రభుత్వం ఐవోసీని ఎందుకు సస్పెండ్ చేసిందో అర్థం చేసుకున్నా. అయితే ఐవోఏ అనేది ఓ సంస్థ. ఇది ఐవోసీ, ఓసీఏ ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ల నిబంధనలు, మార్గదర్శకత్వంలో మేం నడుచుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు తిరిగొచ్చాకా ఈ విషయంపై చర్చలు జరుపుతాం. ఆ తర్వాత ప్రభుత్వాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా అని రామచంద్రన్ పేర్కొన్నాడు. మరోవైపు ఐవోఏలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తున్నామని ఐవోసీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here