భారత అగ్రశ్రేణి షూటర్‌ గగన్‌

0
5

హనోవర్‌: భారత అగ్రశ్రేణి షూటర్‌ గగన్‌ నారంగ్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటాడు. జర్మనీలోని హనోవర్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచాడు. అర్హత రౌండ్లో మొత్తం 622.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన నారంగ్‌.. ఫైనల్లో 249.6 స్కోరుతో పసిడి సొంతం చేసుకున్నాడు. నారంగ్‌, ముకుంద్‌, గౌరవ్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ విభాగంలో 1839.7 పాయింట్లతో కాంస్యం నెగ్గింది. అమెరికా (1859.7), కజకిస్థాన్‌ (1842) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

LEAVE A REPLY