భారత్ వ్యతిరేకులకు గట్టిగా బుద్ధి చెప్పాలి

0
24

భారత్ ప్రగతిని, భద్రతను దెబ్బతీయాలని చూసేవారికి వ్యతిరేకంగా బలమైన నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. చెన్నైలోని తాంబరంలో వైమానిక దళ స్థావరంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన 125 హెలికాప్టర్ స్కాడ్రన్‌కు ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ, భారత వ్యతిరేక కుట్రలను బలంగా ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. 125 హెలికాప్టర్ స్కాడ్రన్ పఠాన్‌కోట్ స్థావరంపై ఉగ్రదాడి సందర్భంగా నిర్వహించిన పాత్రను ప్రశంసించారు.

మహిళను గౌరవించని సమాజం దేనికి?

మహిళలను గౌరవించని ఏ సమాజం కూడా నాగరికమైందని చెప్పుకోవడానికి వీల్లేదని రాష్ట్రపతి ముఖర్జీ అన్నారు. విమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, జాతీయ స్థూల ఉత్పత్తి లెక్కింపులో మహిళల పాత్రను పరిగణనకు తీసుకోకపోవడం వివక్ష కిందకే వస్తుందని అన్నారు. మహిళను దేవతగా పూజించే దేశంలో మహిళలకు సరైన గౌరవం లభించాలంటే ఇంకా చాలాకాలం పడుతుందని రాష్ట్రపతి అన్నారు.

LEAVE A REPLY