భారత్-పాక్ మ్యాచా మజాకానా!… యాడ్ టారిఫ్ ధరలను 10 రెట్లు పెంచిన స్టార్ స్పోర్ట్

0
22

భారత్-పాక్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్లాది మంది టీవీ స్క్రీన్లకు అతుక్కుపోతారు. అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇక మ్యాచ్ లను ప్రసారం చేసే టీవీ ఛానళ్లకైతే పండగే పండగ. దాయాదుల పోరుకు వచ్చే టీఆర్పీ రేటింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాయాది దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ కు అభిమానుల స్పందన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఈ టోర్నీని ప్రసారం చేయనున్న స్టార్ స్పోర్ట్స్ కు కాసుల పంట పండించబోతోంది. ఈ మ్యాచ్ లో యాడ్ టారిఫ్ ను అమాంతం పెంచేసింది స్టార్ స్పోర్ట్స్. ఇతర మ్యాచ్ ల కంటే దాదాపు 10 రెట్లు టారిఫ్ ను పెంచేసింది. ఇప్పటికే యాడ్ కంపెనీలకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 30 సెకండ్ల యాడ్ కు మన కరెన్సీలో అక్షరాలా కోటి రూపాయలను వసూలు చేయబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here