భారత్ తొలి ఇన్నింగ్స్ 631 -ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 182/6

0
23

మన చేతుల్లోకి వచ్చేసింది. ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో టీమ్‌ఇండియా భారీ విజయానికి చేరువైంది. సుదీర్ఘ సిరీస్‌లో తమ అద్భుత ప్రదర్శనను దిగ్విజయంగా కొనసాగిస్తూ స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, జయంత్ విజృంభించడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం ఇక గగనమే. మరోవైపు కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీకి తోడు జయంత్ తొలి శతకంతో భారీ స్కోరందుకున్న భారత్.. మరో టెస్ట్ మిగిలుండగానే సిరీస్ దక్కించుకోవడం ఖాయమైంది.

భారత్ గెలుపు ఇక లాంఛనమే. అద్భుతం జరిగితే తప్ప మన విజయాన్ని అడ్డుకోవడం ఇంగ్లండ్‌కు అసాధ్యమే. కోహ్లీసేన ముంబై టెస్ట్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజయానికి అడుగు దూరంలో ఉంది. 231 పరుగుల వెనుకంజతో రెండోఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లం డ్.. 6వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. బె యిర్‌స్టో (50) క్రీజులో ఉన్నాడు. అశ్విన్ (2/49), జడేజా (2/58)లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జయంత్(1/39), భువనేశ్వర్(1/11)లు ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు 451/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజైన ఆదివారం తొలిఇన్నింగ్స్ కొనసాగించిన భారత్..కెప్టెన్ కోహ్లీ(340 బంతుల్లో 235; 25 ఫోర్లు, సిక్స్), జయంత్ (204 బంతుల్లో 104; 15ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో 631 పరుగుల భారీ స్కోరు సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here