భారత్, జర్మనీది బలమైన బంధం

0
24

జర్మనీకి భారత్ సమర్థ్ధ భాగస్వామి అని, ఇరుదేశాల మధ్య బంధం బలమైనదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జర్మనీ పర్యటనలో మంగళవారం ఆయన చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమయ్యారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని ఈ సందర్భంగా మెర్కెల్ ప్రశంసించారు. అమెరికా, బ్రిటన్ వంటి సంప్రదాయ భాగస్వాములపై ఇక తమ దేశం ఆధారపడటం కుదరదని చెప్పారు. బలమైన దేశాలతో ఈయూ ఆర్థిక సంబంధాలను కలిగిఉండటం విశ్వప్రగతికి దోహదపడుతుందని తెలిపారు. ఇరువురు నేతల చర్చల అనంతరం 12 ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఈయూ-ఇండియా స్వేచ్ఛా వాణిజ్యం, సైబర్ పాలసీ, పట్టణాభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఉగ్రవాదంపై పోరు వంటివి వీటిలో ఉన్నాయి. భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్థిక ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని, టెర్రరిజాన్ని ప్రోత్సహించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

LEAVE A REPLY