భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది

0
15

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏం చేశామో ప్రజలకు చెబుతున్నామని అన్నారు. భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని, విదేశీ నాయకులు మోదీని కలవడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. 31కోట్ల పేద ప్రజలకు జన్ ధన్ ఖాతాలు ఇచ్చాం. ఆధార్ కార్డు వివరాలను గోప్యంగా ఉంచాం. దేశంలో 120 మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేశాం. దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేశాం. నాలుగేళ్లలో 7కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మించాం. 2 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేశాం. 80కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేశాం.

హైదరాబాద్ దేశానికి ఐటీ సిటీగా మారిందని ప్రశంసించారు. దేశంలోని చిన్న పట్టణాలకు కూడా ఐటీని విస్తరించాం. పేద, మధ్యతరగతి ప్రజలకు 3కోట్ల 5లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ప్రపంచానికి యోగాను పరిచయం చేశాం. ట్రిపుల్ తలాక్ మతానికి సంబంధించిన సమస్యకాదు. మహిళలకు సంబంధించిన సమస్యగా భావించి పార్లమెంట్‌లో బిల్లు పెట్టాం. దీన్ని అన్ని పార్టీల మహిళా నాయకులు సమర్థించారు. మా ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఎస్సీ, ఎస్టీ చట్టం బలోపేతానికి సవరణలు చేశాం. విద్య, వైద్య రంగంలో నాణ్యత పెంచాం. దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది. ఐటీఐఆర్ విషయంలో కేంద్రం చేసేది ఏమీ లేదు. విధాన పరమైన నిర్ణయం తీసుకున్నాం. భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రధాని అవుతానంటూ రాహుల్ గాంధీ చెప్పుకోవడంలో అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here