భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 347/6

0
8

నెంబర్‌వన్‌ స్థాయికి తగ్గట్టుగానే భారత జట్టు అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న చారిత్రక టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 107), మురళీ విజయ్‌ (153 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 105) సెంచరీలతో అదరగొట్టారు. అయితే ఆఖర్లో అఫ్ఘాన్‌ బౌలర్ల ధాటికి మిడిలార్డర్‌ తడబడింది. దీంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 6 వికెట్లకు 347 పరుగులు చేసింది. రాహుల్‌ (54), పుజారా (35) మెరుగ్గా ఆడారు. అయితే రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించి భారత్‌ భారీ స్కోరుకు బ్రేక్‌ వేసింది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా (10 బ్యాటింగ్‌), అశ్విన్‌ (7 బ్యాటింగ్‌) ఉన్నారు. అహ్మద్‌జాయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. రషీద్‌, ముజీబ్‌, వఫాదార్‌ తలో వికెట్‌ తీ
శారు.

LEAVE A REPLY