భారత్‌కు త్వరలోనే భద్రతామండలిలో చోటు

0
18

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు త్వరలోనే శాశ్వతసభ్యత్వం లభిస్తుందని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రతామండలిలో చేరే కొత్త సభ్యదేశాలకు వీటో సహా అన్ని హక్కులు ఉంటాయని గురువారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని, ఇందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా పూర్తి మద్దతునిస్తుండగా, చైనా కూడా బహిరంగంగా వ్యతిరేకించడం లేదని చెప్పారు. సభలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ జాతీయోద్యమ చరిత్రను తిరుగరాసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలతోపాటు నాడు జాతీయోద్యమంలో పాల్గొన్న నేతల పాత్రను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు

LEAVE A REPLY