భారతదేశం కళలకు కాణాచి.. కానీ ఇప్పుడు ఎన్నో కళలు

0
66

ఎన్నో కళలకు పుట్టినిల్లు మన భారతదేశం. హస్తకళలకు పెట్టింది పేరు. కానీ ఇందులో ఇప్పటికే కొన్ని కళలు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. నేటి మార్కెట్‌కి అనుగుణంగా వాటిలో మార్పులు చేస్తేనే ఎవరైనా వాటిని కొనడానికి ఇష్టపడుతారు. ఈ ఆలోచనతోనే ముందుకు సాగారు రేఖ, వంధ్య అనే ఫ్యాషన్ డిజైనర్లు. కాలేజ్ టైమ్‌లో వీరిని ఫీల్డ్ విజిట్‌కి తీసుకెళ్లేవాళ్లు. అప్పుడు ఎన్నో అంతరించి పోతున్న కళలు వారి కంట పడ్డాయి. దాంతో వాటికి కొత్త జీవం పోయాలన్న ఆలోచనకూ బీజం పడింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి మాత్రం రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కొన్ని ఎగ్జిబిషన్లు, ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేయడంతో వీటికి మాంచి డిమాండ్ పెరిగింది.

LEAVE A REPLY