భళా… రామసుబ్బమ్మ.. సీఎం చంద్రబాబు ప్రశంస

0
29

అనంతపురం: జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభంలో రామసుబ్బమ్మ ప్రసంగాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఆకాశం నుంచి ఆ చంద్రుడు వెన్నెల వెలుగులిస్తుంటే… ఆడపడుచుల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రన్న వెలుగులు నింపుతున్నారని తనదైన శైలిలో సీఎంను ఆమె కీర్తించారు. నాడు ఎన్‌టీ రామారావు ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం తెస్తే… నేడు చంద్రబాబునాయుడు అదే స్ఫూర్తితో లింగనిర్ధారణ చట్టం తెచ్చి ఆడబిడ్డకు ఆయుష్షునిచ్చారని కొనియాడారు. ఇలా మహిళల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రసంగంలో గుర్తు చేశారు.

LEAVE A REPLY