భర్తను హత్య చేసిందని మొదటి భార్యపై..

0
15
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్యకేసుకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన వారు పోలీసుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. స్టేషన్‌ ఎదుట పోలీసులు చూస్తుండగానే ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గంవారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు.. రుద్రంగి మండలం మానాల అడ్డబోరు తండాకు చెందిన గుగులోతు రాజుకు పదకొండేళ్ల క్రితం మంజులతో వివాహం జరిగింది. పెళ్లై ఇన్నేళ్లైన పిల్లలు పుట్టకపోవడంతో.. మొదటి భార్య అంగీకారంతో రాజు ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరగుతుండటంతో.. గత నెల 14న రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
దీంతో భర్త కనిపించకపోవడంపై మంజులపై అనుమానాలు ఉన్నాయని రాజు రెండో భార్య, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంజులను స్టేషన్‌కు పిలిపించి విచారించగా తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. విషయం తెలుసుకున్న రెండో భార్య బంధువులు మంజులతో పాటు ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here