భరత్ అనే నేను

0
19

మహేష్‌బాబు కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నా ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు. ఏజెంట్ శివ, వాస్కోడగామ, అభిమన్యు, మర్మం వంటి పలు పేర్లు ఈ చిత్రం కోసం ప్రచారంలో వున్నాయి. తాజాగా ఈ సినిమాకు స్పైడర్ అనే పేరును చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నాయని తెలిసింది. ఇదిలా వుంటే మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో త్వరలో సెట్స్‌పైకి రానున్న తాజా చిత్రానికి ముందే టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రచారంలో వున్న భరత్ అనే నేను అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇటీవల తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here