భన్సాలీని బూటుతో కొడితే 10 వేల నజరానా!

0
15

పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని బూటుతో కొడితే రూ.10 వేల నగదు బహుమతి ఇస్తానని మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్, బీజేపీ నేత అఖిలేశ్ ఖండేల్‌వల్ సోమవారం ప్రకటించారు. చరిత్రను వక్రీకరించి సినిమా తెరకెక్కిస్తున్న బన్సాలీని బూటుతో కొట్టాలని ప్రకటించడానికి తాను ఏమాత్రం చింతించడం లేదని ఆయన పేర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన కొందరు మన చరిత్ర ప్రాముఖ్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 27న జైపూర్‌లోని జయ్‌గఢ్ కోటలో పద్మావతి సినిమా షూటింగ్ జరిగే సమయంలో కర్ణిసేన కార్యకర్తలు దర్శకుడు భన్సాలీపై దాడిచేశారు. ఆ తర్వాత సినిమా షూటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మావతిల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించారని కర్ణిసేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమి లేవని పద్మావతి నిర్మాత భన్సాలీ, వయకమ్ 18 మోషన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY