భద్రాద్రికి పర్యావరణ పచ్చజెండా

0
5

తెలంగాణ విద్యుత్ రంగానికి శుభవార్త. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) అనుమతి లభించింది. ఈ ప్లాంట్‌కు అనుమతులు ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చేసిన సిఫారసు మేరకు ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ ప్లాంట్‌ను అడ్డుకోవడమే ఎజెండాగా సాగిన కుట్రలకు తెరపడింది. ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు.. అన్నీ చెల్లాచెదురైపోయాయి. ఖమ్మం జిల్లా మణుగూరులో తలపెట్టిన ఈ 1080 మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణశాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగానే ఒక ఎన్జీవో తరఫున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది. అక్కడ విచారణలోనే నెలల తరబడి ఆలస్యం జరిగింది. ఈలోగా సబ్ క్రిటికల్ విధానంలో విద్యుత్ ప్లాంటు ఎందుకు చేపడుతున్నారంటూ ప్రతిపక్షాలు దాడులు ప్రారంభించాయి. ప్రభుత్వం ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసి అనుమతులు తేవటం ద్వారా దీన్ని అడ్డుకోవాలనుకున్న వారికి చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది.

LEAVE A REPLY