భద్రంగా డిజిటల్‌ లావాదేవీలు

0
56

నోట్ల రద్దుతో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ లావాదేవీల్లో డేటా చౌర్యాన్ని నిరోధించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది. ఈ తరహా లావాదేవీలతో అక్రమార్కులు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన సందర్భంలో ఎలక్ట్రానిక్‌ చెల్లింపు కంపెనీల విధులు, జవాబుదారీతనాన్ని ఇందులో నిర్వచిస్తారు. ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్లాస్టిక్‌ కార్డుల వినియోగం, బ్యాంకుల ఇంటర్నెట్‌ సేవలు, చెల్లింపు గేట్‌వేలు, ఈ-వ్యాలెట్లు, ప్రీపెయిడ్‌ కార్డులు, ఇతర చెల్లింపు వేదికలకు ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ఐటీ చట్టం-2000ను సవరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here