భజ్జీ నిలదీశాడు.. అంతలోనే!

0
23

ఇంగ్లాండ్‌పై చెన్నై టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ చేసిన యువ ఆటగాడు కరుణ్‌ నాయర్‌కు భారత వన్డే, టీ20 జట్లలో చోటు దక్కకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20లకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సెలక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించిన నేపథ్యంలో భజ్జీ స్పందిస్తూ.. ‘‘ఇంగ్లాండ్‌పై 300 చేసిన కరుణ్‌ నాయర్‌ ఎక్కడ? వన్డేల సంగతి అలా ఉంచుదాం. కనీసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్లలోనూ అతను లేడు. ఏం ఆట ఇది’’ అని హర్భజన్‌ ట్వీట్‌ చేశాడు. ఐతే భజ్జీ ట్వీట్‌ మీద సామాజిక మాధ్యమంలో పెద్ద చర్చ నడవడంతో కొంత సేపటి తర్వాత అతను ఆ ట్వీట్‌ను తొలగించడం గమనార్హం.

LEAVE A REPLY